Featured Post

టిఆర్ఎస్ పార్టీలో ఉద్యమకారులకు స్థానం లేకుండాపోతోంది... తాజాగా ఈటెల రాజేందర్..

 టీఆర్ఎస్ లో ఉద్యమ నేతలేరీ ? ఈటెల రాజేందర్ బర్తరఫ్ తో కేసీఆర్ తీరుపై తెలంగాణలో హాట్ డిబేట్..

టిఆర్ఎస్ పార్టీలో ఉద్యమకారులకు స్థానం లేకుండాపోతోంది. తాజాగా ఈటెల రాజేందర్ భర్తరఫ్ తో ఈ విషయం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం సాగించిన ఉద్యమకారులను ఒక్కొక్కరిగా గులాబీ బాస్ బయటకు పంపిస్తున్నారు అన్న చర్చ ప్రస్తుతం తెలంగాణ లో హాట్ టాపిక్ గా మారింది. ఈటెల బర్తరఫ్ తో పెద్ద ఎత్తున పార్టీ ప్రస్థానంపై చర్చ జరుగుతుంది.టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి చూసే పార్టీలో ఎవరు స్ట్రాంగ్ అవుతున్నా, ప్రజల్లో వారికి ఎక్కువ ఆదరణ పెరుగుతున్నా, అలాంటి వారిని టార్గెట్ చేసి సైలెంట్ గా బయటికి పంపిస్తున్నారు సీఎం కేసీఆర్. కొందరిపై అభియోగాలు మోపి, మరికొందరికి పొమ్మనకుండా పొగ పెట్టి మరీ సాగనంపుతున్నారు.

ఈటెల రాజేందర్ వరకు కొనసాగుతూనే ఉంది. తల్లితెలంగాణా పార్టీ విజయశాంతిని పార్టీలో చేర్చుకుని బయటకు గెంటేసిన కేసీఆర్ తల్లితెలంగాణా పార్టీ విజయశాంతిని పార్టీలో చేర్చుకుని బయటకు గెంటేసిన కేసీఆర్ తల్లి తెలంగాణ పేరుతో విజయశాంతి తెలంగాణ కోసం పోరాటం చేస్తుంటే విజయశాంతిని సైతం టిఆర్ఎస్ పార్టీలో చేర్చుకుని ఆ తర్వాత బయటకు వెళ్లగొట్టారు.ఆలె నరేంద్ర పై అభియోగాలు మోపి పార్టీ నుండి సస్పెండ్ చేశారు. ఇక తెలంగాణ ఉద్యమంలో ఎంతో పని చేసిన వారు, ఉద్యమకారులు అయినా మందాడి సత్యనారాయణ,కాశిపేట లింగయ్య, శనిగరం సంతోష్ రెడ్డి కెసిఆర్ తీరుతో పార్టీ నుండి బయటకు వచ్చేశారు. వరంగల్ ఎంపీ గెలిచిన రవీంద్ర నాయక్ ను ఘోరంగా అవమానించి చివరకు ఆఫీస్ లోకి రానివ్వలేదు. జిట్టా బాలకృష్ణా రెడ్డి , రఘునందన్ రావు, గాదె ఇన్నయ్య ఇలా ఎందరో జిట్టా బాలకృష్ణా రెడ్డి , రఘునందన్ రావు, గాదె ఇన్నయ్య ఇలా ఎందరో తెలంగాణ జాతర పేరుతో సంస్కృతి సంప్రదాయాలను ప్రపంచానికి చెప్పే ప్రయత్నం చేసిన జిట్టా బాలకృష్ణారెడ్డికి టికెట్ ఇవ్వకుండా అవమానించి బయటకు పంపేశారు. ఉద్యమంలో పాలుపంచుకున్న, కెసిఆర్ కు వెన్నుదన్నుగా నిలిచిన రఘునందన్ రావును కరీంనగర్ కేసీఆర్ దే తెలంగాణ కోసం పీడీ యాక్ట్ కింద జైలుకు వెళ్లిన చెరుకు సుధాకర్ ని కూడా ఇబ్బంది పెట్టారు. 


 

టిఆర్ఎస్ పార్టీ ప్రారంభంలో ఎంతో కష్టపడిన గాదె ఇన్నయ్య ను పక్కా ప్లాన్ ప్రకారం బయటకి తరిమారు. ప్రొఫెసర్ కోదండరాం ను ఘోరంగా అవమానించిన కేసీఆర్ ప్రొఫెసర్ కోదండరాం ను ఘోరంగా అవమానించిన కేసీఆర్ దాసోజు శ్రవణ్, రాములు నాయక్ ,యెన్నం శ్రీనివాస్ రెడ్డి, జితేందర్ రెడ్డి, రేగులపాటి పాపారావు, సుదర్శన్ ఇలా ఎందరో నాడు ఉద్యమంలో పాల్గొన్న నాయకులు కెసిఆర్ అవమానాలను భరించలేక పార్టీని వీడి బయటకు వెళ్లారు. పొలిటికల్ జేఏసీ నేతగా అందరినీ ఒక్క తాటిపైకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన ప్రొఫెసర్ కోదండరామ్ ను కెసిఆర్ ఘోరంగా అవమానించారు. ప్రొఫెసర్ కోదండరామ్ సొంతంగా పార్టీ పెట్టుకునేలా చేశారు. పక్కా ప్లాన్ ప్రకారమే ఆయన్ను టిఆర్ఎస్ కు దూరం చేశారు. 

 

ప్రస్తుతం కేసీఆర్ క్యాబినెట్లో ఉద్యమకాల నేతలు ఐదుగురే ప్రస్తుతం కేసీఆర్ క్యాబినెట్లో ఉద్యమకాల నేతలు ఐదుగురే ప్రస్తుతం కేసీఆర్ క్యాబినెట్ లో ఉద్యమ కాలం నుంచి కెసిఆర్ తో ఉన్న నేతల్లో మిగిలింది ఐదుగురు నేతలు మాత్రమే. హరీష్ రావు, జగదీశ్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, నిరంజన్ రెడ్డితో పాటుగా 2009 తర్వాత వచ్చిన కేటీఆర్ మాత్రమే ప్రస్తుతం నాడు టిఆర్ఎస్ పార్టీతో ఉన్న అప్పటి నాయకులు. మిగతా మంత్రులంతా ఎక్కువ మంది ఇతర పార్టీల నుండి తెలంగాణ, రాష్ట్రాన్ని తీవ్రంగా వ్యతిరేకించి సీఎం కేసీఆర్ పై తీవ్ర విమర్శలు గుప్పించిన వారే ఉన్నారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ నాడు టిడిపిలో ఉండి కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేసిన వారే . ఈటెల రాజేందర్ బర్తరఫ్ తో తెలంగాణలో మొదలైన ఆసక్తికర చర్చ ఈటెల రాజేందర్ బర్తరఫ్ తో తెలంగాణలో మొదలైన ఆసక్తికర చర్చ ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీలో ఉన్న మంత్రులుగా ఉన్న మల్లారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి ,సత్యవతి రాథోడ్ పువ్వాడ అజయ్, ఇంద్రకరణ్ రెడ్డి తదితరులంతా ఇతర పార్టీల నుండి వచ్చిన వారే. ప్రస్తుతం ఈ పరిస్థితులపై తెలంగాణ రాష్ట్రంలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. టిఆర్ఎస్ పార్టీ ప్రారంభం నుండి పార్టీ కోసం కీలకంగా పని చేసి ఉద్యమంలో కేసీఆర్ కు చేదోడు వాదోడుగా ఉన్న ఈటెల రాజేందర్ ను బర్తరఫ్ చేయడంతో కేసీఆర్ తీరుపై, టిఆర్ఎస్ పార్టీలో అసలు ఉద్యమకారులు ఉన్నారా అన్న అంశంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఏదిఏమైనప్పటికీ తెలంగాణాలో ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలు భవిష్యత్తులో ఏ మలుపు తీసుకుంటాయో అన్న చర్చ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా...

Read more at: https://telugu.oneindia.com/news/telangana/movement-leaders-in-trs-hot-debate-on-kcr-s-behaviour-with-the-sack-of-etela-rajender/articlecontent-pf321315-292911.html


Comments