Featured Post

Telangana EPASS: తెలంగాణ విద్యార్థులకు అలర్ట్.. ఆ గడువు పొడిగించిన సర్కార్..

 


లక్షల మంది విద్యార్థుల ప్రయోజనార్థం తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అడ్మిషన్ల ప్రక్రియ ఆలస్యం కావడంతో స్కాలర్ షిప్, ఫీజు రీయింబర్స్ మెంట్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరు తేదీని పొడిగించింది.

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పోస్టుమెట్రిక్ విద్యార్థుల ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం దరఖాస్తు ప్రక్రియను పొడిగిస్తూ సర్కార్ నిర్ణయం తీసుకుంది. కరోనా నేపథ్యంలో అడ్మిషన్ల ప్రక్రియ ఆలస్యం కావడం, రెన్యువల్ కోసం అనేక మంది విద్యార్థులు ఇంకా దరఖాస్తులు సమర్పించకపోవడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే దరఖాస్తు చేసుకోవడానికి మొదటగా డిసెంబర్ 31, 2020ని ఆఖరు తేదీగా నిర్ణయించారు. అయితే విద్యార్థుల ప్రయోజనాల దృష్ట్యా ఈ పాస్ ద్వారా దరఖాస్తుల స్వీకరణకు గడువును March 31వ తేదీ వరకు ప్రభుత్వం పొడిగించింది.

for more details visit official website:  https://telanganaepass.cgg.gov.in/

Comments